స్విమ్మింగ్ పోటీల్లో అదరగొడుతున్న నటుడు మాధవన్ తనయుడు.. ఏడు పతకాలతో రికార్డు
- బెంగళూరులో జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ ఆక్వాటిక్ చాంపియన్షిప్స్
- మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన వేదాంత్
- నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు
కాగా, ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్, 1500 మీటర్ల ఫ్రీ స్టైల్, 4X200 ఫ్రీ స్టైల్ రిలోలో రజత పతకాలు సాధించగా, 100, 200, 400 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు అందుకున్నాడు. ఈ పోటీల్లో కర్ణాటక చాంపియన్గా నిలిచింది. కాగా, మార్చిలో జరిగిన లాట్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో వేదాంత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.