డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ డ్రైవర్ కు నోటీసులు పంపిన ఎన్సీబీ
- లగ్జరీ నౌకపై రేవ్ పార్టీ
- అరెస్టయిన షారుఖ్ తనయుడు ఆర్యన్
- కొనసాగుతున్న ఎన్సీబీ విచారణ
- డ్రగ్స్ తీసుకున్నట్టు ఆర్యన్ వెల్లడి!
ఈ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టవడం తెలిసిందే. ఎన్సీబీ అధికారుల విచారణలో తాను డ్రగ్స్ వాడినట్టు ఆర్యన్ అంగీకరించాడు. ప్రస్తుతం ఆర్యన్ ముంబయి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను ముంబయి సిటీ కోర్టు కొట్టివేసింది. ఆర్యన్ బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.