'స్వాతి ముత్యం'గా బెల్లంకొండ గణేశ్ .. ఫస్టులుక్
- హీరోగా బెల్లంకొండ గణేశ్
- కథానాయికగా వర్ష బొల్లమ్మ
- దర్శకుడిగా లక్ష్మణ్ కృష్ణ పరిచయం
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ రోజున బెల్లంకొండ గణేశ్ పుట్టినరోజు కావడంతో టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి 'స్వాతిముత్యం' అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చాలా సింపుల్ లుక్ తో గణేశ్ ఆకట్టుకుంటున్నాడు.
ఈ సినిమాలో ఆయన జోడీగా వర్ష బొల్లమ్మ అలరించనుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మాదిరిగానే, గణేశ్ కూడా హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.