సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బాలీవుడ్ పై దృష్టి పెట్టిన సమంత
- 'గాడ్ ఫాదర్'లో మలయాళ నటుడు
- తమిళ దర్శకుల సంయుక్త నిర్మాణం
* మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరిట రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం.
* ప్రముఖ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్ కలసి సంయుక్తంగా చిత్ర నిర్మాణాన్ని చేబడుతున్నారు. ఇందుకోసం 'రైన్ ఆన్ ఫిలిమ్స్' అనే బ్యానర్ ను నెలకొల్పారు. ఈ బ్యానర్ పై ముఖ్యంగా ఓటీటీ వేదికల కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా వీరు నిర్మించే తొలి చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడట.