'బంగార్రాజు' షూటింగ్ ప్రారంభం!
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- నాగ్ సరసన రమ్యకృష్ణ
- చైతూ జోడీగా కృతి శెట్టి
- సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన
అయితే ఆ టైటిల్ కి తగిన కథను తయారు చేసుకుని నాగార్జునను ఒప్పించడానికి కల్యాణ్ కృష్ణ చాలా సమయమే తీసుకున్నాడు. ఆ తరువాత మరికొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమాకి ముహూర్తం కుదిరింది. ఈ రోజున హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక నాగచైతన్య ఒక కీలకమైన పాత్రను పోషించనుండగా, ఆయన సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 'సంక్రాంతి' బరిలోనే ఈ సినిమాను దింపాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారు.