'బొమ్మల కొలువు' నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!
- క్రైమ్ థ్రిల్లర్ గా 'బొమ్మల కొలువు'
- దర్శకుడిగా సుబ్బు వేదుల పరిచయం
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందమైన అమ్మాయిలను వరుసగా కిడ్నాప్ చేయడం ... ఆ తరువాత వాళ్లను హత్య చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ల శవాలను ప్యాక్ చేసి రహస్యంగా పారేయడం చేస్తుంటాడు. అదృశ్యమైన యువతులకి సంబంధించిన వారు పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడమే ఇక్కడ విచిత్రం.
అమ్మాయిలను టార్గెట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఫిర్యాదులను అందరూ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? 'బొమ్మల కొలువు'కు .. ఈ కథకు మంధ్య లింక్ ఏంటి? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. 'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తమ్ముడిగా చేసిన హృషీకేశ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ముఖ్యపాత్రల్లో ప్రియాంక శర్మ .. మాళవిక సతీషన్ కనిపించనున్నారు.