మహేశ్ తో సినిమాపై స్పందించిన మణిరత్నం!
- గొప్ప దర్శకుడిగా పేరు
- సహజత్వానికి పెద్దపీట
- పాత్రలను బట్టే నటీనటుల ఎంపిక
- తెలుగులో చేయాలనుందన్న మణిరత్నం
ప్రస్తుతం ఆయన 'పొన్నియిన్ సెల్వన్' అనే భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఆ మధ్య ఆయన మహేశ్ కి ఒక కథను చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించిన ప్రస్తావన రాగా, అది నిజమేనని ఆయన సమాధానమిచ్చారు. ఒక కథ విషయంలో మహేశ్ ను కలిసి మాట్లాడటం జరిగిందనీ, అయితే కొన్ని కారణాల వలన అది వర్కౌట్ కాలేదని అన్నారు. కథలను బట్టే తాను నటీనటులను ఎంపిక చేస్తూ ఉంటాననీ, నేరుగా తెలుగులో ఒక సినిమా చేసే ఆలోచన ఉందని ఆయన అన్నారు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో .. ఆ సందర్భం ఇప్పుడు కుదురుతుందో ఏమో!