మళ్లీ రంగంలోకి దిగుతోన్న 'పొన్నియిన్ సెల్వన్' టీమ్
- చారిత్రక నేపథ్యంలో మణిరత్నం తాజా చిత్రం
- భారీ తారాగణంతో 'పొన్నియిన్ సెల్వన్'
- ఈ నెల 15 నుంచి తదుపరి షెడ్యూల్
మధ్యప్రదేశ్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో షూటింగు ఆపేశారు. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి షూటింగు మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మధ్యప్రదేశ్ వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. మణిరత్నం నుంచి రానున్న పాన్ ఇండియా మూవీ కావడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.