సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పెళ్లి వాయిదా వేసుకున్న కథానాయిక
- మహేశ్ ఫస్ట్ లుక్ పై తేల్చేసిన నిర్మాతలు
- 'వకీల్ సాబ్' దర్శకుడితో నాని సినిమా
* మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ నెల 31న విడుదల చేస్తారంటూ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని, ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం లేదని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనిపై అనవసరమైన వదంతులను వ్యాపింపజేయవద్దని నిర్మాతలు కోరారు.
* ఇటీవల 'వకీల్ సాబ్' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ విషయమై వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.