సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బాలకృష్ణ సినిమాలో సోనాక్షి సిన్హా!
- డబ్బింగ్ మొదలెట్టిన 'వకీల్ సాబ్'
- సూర్య తెలుగు సినిమాల నిర్మాణం
* పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన 'వకీల్ సాబ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్నటి నుంచి పవన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తారు.
* ప్రముఖ తమిళ చిత్ర కథానాయకుడు సూర్య తెలుగులో కూడా సొంత చిత్ర నిర్మాణాన్ని జరపాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే ఆయన 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తమిళంలో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇదే బ్యానర్ పై తెలుగులో కూడా సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆ దిశగా ప్లానింగ్ చేస్తున్నాడట.