మరో సినిమాలో స్పెషల్ సాంగుకి ఓకే చెప్పిన అనసూయ!
- కొన్ని సినిమాలలో హీరోయిన్ గా అనసూయ
- మరికొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులు
- 'చావు కబురు చల్లగా'లో ప్రత్యేక గీతం
- హీరో హీరోయిన్లుగా కార్తికేయ, లావణ్య
ఈ క్రమంలో తాజాగా మరో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా 'చావు కబురు చల్లగా' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ ఐటం సాంగ్ చేయడానికి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాట తమ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. కౌశిక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ కు చెందిన బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.