సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కామెడీ పాత్రలు కావాలంటున్న నివేద
- కల్యాణ్ రామ్ మలయాళం రీమేక్
- 'కిసాన్' సినిమాలో హీరోగా సోనూ సూద్
* నందమూరి కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రంగా ఓ మలయాళ రీమేక్ ను చేయనున్నాడు. 'అంజామ్ పథిరా' అనే మలయాళం చిత్రాన్ని రీమేక్ చేసే ఉద్దేశంలో కల్యాణ్ రామ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు కల్యాణ్ రామ్ తో '118' చిత్రాన్ని చేసిన దర్శకుడు గుహన్ దీనికి దర్శకత్వం వహిస్తాడట.
* రైతుల సమస్యలపై రూపొందే 'కిసాన్' సినిమాలో ప్రముఖ నటుడు సోనూ సూద్ హీరోగా నటించనున్నాడు. ఇందులో ఆయన రైతు పాత్రను పోషిస్తాడు. ఇ.నివాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు రాజ్ శాండిల్య నిర్మిస్తారు.