చిరంజీవి సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర?
- టాలెంటెడ్ నటుడిగా సత్యదేవ్ కి పేరు
- 'ఆచార్య' తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్
- కీలక పాత్రకు సత్యదేవ్ ఎంపిక
- ఇటీవల చిరంజీవితో ఫొటో దిగిన వైనం
'ఆచార్య' సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నారు. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకు గాను తాజాగా సత్యదేవ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అదే కనుక వాస్తవమైతే, చిరంజీవి తర్వాత ఈ సినిమాలో సత్యదేవ్ నటించేదే ముఖ్య పాత్ర అవుతుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలోనే రెండు రోజుల క్రితం చిరంజీవిని సత్యదేవ్ కలిసినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంగా దిగిన ఫొటోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.