టీఎస్పీఎస్సీకి తాత్కాలిక చైర్మన్గా కృష్ణారెడ్డికి బాధ్యతలు
- నిన్నటితో ముగిసిన ఘంటా చక్రపాణి పదవీ కాలం
- కమిషన్లో సీనియర్ అయిన కృష్ణారెడ్డికి బాధ్యతలు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆ తర్వాత 2015, అక్టోబరు 14న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. 18 మార్చి 2021తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండడం తగదన్న ఉద్దేశంతో కమిషన్లో సీనియర్ అయిన కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. కాగా, ఘంటాతోపాటు సభ్యులు విఠల్, మతీనుద్దీన్, చంద్రావతిల పదవీకాలం కూడా నిన్నటితో ముగిసింది.