రియా చక్రవర్తికి అంత స్థాయి లేదు: బీహార్ డీజీపీ
- సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రియా
- బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం వెనుక నితీశ్ హస్తం ఉందని ఆరోపణ
- ఒక సీఎం గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదన్న డీజీపీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని... అందుకే సుశాంత్ కేసులో రాద్ధాంతం చేస్తున్నారని తన పిటిషన్ లో రియా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కేసుపై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడాన్ని ప్రస్తావిస్తూ... దీని వెనుక బీహార్ సీఎం జోక్యం ఉందని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై బీహార్ డీజీపీ స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.