కలియుగం.. రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారు: ఖుష్బూ
- అయోధ్యకు భూమిపూజ చేసిన మోదీ
- మోదీపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
- మోదీని రాజుగా పేర్కొన్న సదానందగౌడ
కర్ణాటక బీజేపీ ఎంపీ సదానందగౌడ ఈ ఉదయం ట్వీట్ చేస్తూ... తన ప్రియతమ రాజు మోదీని తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ట్వీట్ ను సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాముడి కంటే మోదీ ఎక్కువయ్యాడని... కలికాలం అంటే ఇదేనని విమర్శించారు.