టాలీవుడ్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్?
- క్రీడా రంగాల బయోపిక్ లకు ప్రస్తుతం ఆదరణ
- తెలుగులో కరణం మల్లేశ్వరి బయోపిక్
- రకుల్ ప్రీత్ సింగ్ తో తాజాగా ఒప్పందం
ఈ క్రమంలో ప్రముఖ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్స్ విజేత, తెలుగు మహిళ అయిన కరణం మల్లేశ్వరి బయోపిక్ కూడా రూపొందుతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్, విశాఖ ఎంపీ ఏమ్వీవీ సత్యనారాయణ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తోంది. ఇక ఇందులో కరణం మల్లేశ్వరి పాత్రకు పలువురిని పరిశీలించిన మీదట తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆమెతో ఒప్పందం కూడా జరిగినట్టు చెబుతున్నారు.