మహేశ్ సినిమాకి పవర్ ఫుల్ విలన్ కావాలట!
- మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
- హీరోకి సమాంతరంగా విలన్ పాత్ర
- అరవింద్ స్వామి, ఉపేంద్ర, సుదీప్ లలో ఒకరు
ఇటువంటి పవర్ ఫుల్ పాత్రలో మరి పవర్ ఫుల్ నటుడే వుండాలి కదా? అందుకే చిత్ర బృందం సరైన నటుడి కోసం అన్వేషిస్తోంది.ఈ కోవలో కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలోనూ ఒకరిని ఈ ప్రధాన విలన్ పాత్రకు ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే, ఇంతవరకు ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. త్వరలో వీరి ఎంపిక పూర్తవుతుంది. ఇక ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే!