చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో సుహాసిని?
- చిరంజీవితో మలయాళం హిట్ 'లూసిఫర్' రీమేక్
- ప్రస్తుతం ముమ్మరంగా ప్రీ ప్రొడక్షన్ పనులు
- మంజూ వారియర్ పాత్రలో సుహాసిని
మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ మంచి విజయాన్ని సాధించింది. దీంతో తన తండ్రితో దీనిని రీమేక్ చేయడానికి హీరో రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మలయాళం ఒరిజినల్ లో మంజూ వారియర్ పోషించిన కీలక పాత్రకు టాలెంటెడ్ నటిని ఎంపిక చేయాలని భావించి, సుహాసినిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టుకి మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు.