'ఆర్ఆర్ఆర్'ను ఆ రోజున విడుదల చేయలేము: నిర్మాత డీవీవీ దానయ్య
- ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- సంక్రాంతి కానుక లేనట్టే
- ఏప్రిల్ 28న రిలీజ్ చేసే ఛాన్స్
అయితే ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయలేమని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. 'జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే అనుకున్నాము, అయితే లాక్ డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి. అందువలన ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేము' అని చెప్పుకొచ్చారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి 2 సినిమా థియేటర్స్ కి వచ్చినరోజు అదేననే విషయం అందరికీ తెలిసిందే.