తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్ రుహానీ శర్మ!
- 'హిట్' సినిమాతో మంచి గుర్తింపు
- చేతిలో మూడు సినిమాలు
- అవకాశాలు పెరుగుతాయనే ఆశతో రుహాని
ఈ మూడు సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలు తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయని భావించిన రహానీ శర్మ, తెలుగు భాష నేర్చుకోవడంపై దృష్టి పెట్టిందట. భాష వచ్చి వుంటే భావాలను సరిగ్గా పలికించడానికి అవకాశం ఉంటుందని భావించిన రుహానీ, తెలుగు నేర్చుకోవడానికి రోజుకి రెండు గంటల సమయాన్ని కేటాయిస్తుందట.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వున్న రుహానీ, లాక్ డౌన్ పూర్తయ్యేలోగా తెలుగును నేర్చుకోవాలనే పట్టుదలతో గట్టిగానే కసరత్తు చేస్తోందట. తెలుగు భాష నేర్చుకున్న తరువాత, ఈ సుందరి తన పాత్రకి తానే డబ్బింగ్ చెబుతుందేమో చూడాలి.