ఆ వార్తల్లో నిజం లేదు .. నాపై నాగార్జునగారికి కోపం లేదు: దర్శకుడు పరశురామ్
- 'నాగేశ్వరరావు' ప్రాజెక్టు ఆగిపోలేదు
- చైతూ కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుంది
- మహేశ్ మూవీ తరువాత పట్టాలెక్కుతుందన్న పరశురామ్
పరశురామ్ ఈ విధంగా చేయడం పట్ల నాగార్జున కోపంగా ఉన్నారనీ, ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రచారంపై తాజాగా పరశురామ్ స్పందిస్తూ .. " చైతూతో నేను చేయవలసిన సినిమా ఆగిపోలేదు. మహేశ్ బాబుతో సినిమా పూర్తయిన తరువాత, 'నాగేశ్వరరావు' పట్టాలెక్కుతుంది. చైతూ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది. అక్కినేని ఫ్యామిలీతో నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. నాపై నాగార్జునగారికి కోపం వచ్చిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు" అని చెప్పుకొచ్చాడు.