కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం?
- సొంత సినిమాతో బిజీగా కల్యాణ్ రామ్
- మరో రెండు సినిమాలు సెట్స్ పైకి
- ట్రిపుల్ యాక్షన్ కథతో కల్యాణ్ రామ్ ను కలిసిన నిర్మాతలు
ఇక వీఐ ఆనంద్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మించే సినిమా ఒకటి, గుహన్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించే సినిమా ఒకటి లైన్లో వున్నాయి. ఈ నేపథ్యంలోనే మైత్రీ మూవీ మేకర్లు కల్యాణ్ రామ్ దగ్గరికి ఒక కథతో వచ్చారట. ఇది త్రిపాత్రాభినయానికి సంబంధించిన కథ. హీరో ట్రిపుల్ యాక్షన్ చేయవలసి ఉంటుంది. యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువగానే వున్నాయని సమాచారం. ఈ కథ విన్న కల్యాణ్ రామ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. వరుస సినిమాలతో బిజీగా వున్న ఆయన ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.