'ఎంతమంచివాడవురా' నుంచి ఆకట్టుకుంటున్న సాంగ్
- కుటుంబ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- ముఖ్య పాత్రల్లో శరత్ బాబు - సుహాసిని
- జనవరి 15వ తేదీన భారీ విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "ఓ చిన్న నవ్వే చాలు .. పదా పలకరిద్దాం .. ఓ చిన్న మాటే చాలు .. బంధాలు అల్లుకుందాం .." అంటూ ఈ పాట సాగుతోంది. కుటుంబం .. బంధాలు నేపథ్యంలో ఈ పాట సాగుతోంది. గోపీసుందర్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి - గీతా మాధురి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. శరత్ బాబు .. సుహాసిని .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.