నైజామ్ లో 'డియర్ కామ్రేడ్' దూకుడు
- ఈ నెల 26న వచ్చిన 'డియర్ కామ్రేడ్'
- ఓవర్సీస్ లోను భారీ వసూళ్లు
- హిందీ రీమేక్ కి సన్నాహాలు
ఇక నైజామ్ లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల్లో ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 5.68 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక తెలంగాణలో ఈ రోజు కూడా బోనాల పండుగ సందర్భంగా సెలవు కావడంతో, ఈ రోజున కూడా మంచి వసూళ్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను విడుదలైన ఈ సినిమాను, హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.