'గుణ 369' విడుదలకి రంగం సిద్ధం
- కార్తికేయ నుంచి మరో ప్రేమకథా చిత్రం
- కథానాయికగా 'అనఘ' పరిచయం
- వచ్చేనెల 2వ తేదీన భారీ విడుదల
ఆగస్టు 2వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. తిరుమల రెడ్డి - అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, లవ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుంది. 'హిప్పీ' ఫలితం నిరాశపరచడంతో, 'గుణ 369' తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.