భారత్ లో పెరిగిన టీవీల దిగుమతి!
- మొత్తంగా రూ. 7,224 కోట్ల విలువైన టీవీల దిగుమతి
- సగానికి పైగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న భారత్
- తర్వాతి స్థానాల్లో వియత్నాం, మలేషియా, హాంకాంగ్, తైవాన్
వీటిలో సగానికి పైగా దిగుమతులను చైనా నుంచి చేసుకోగా, వియత్నాం, మలేషియా, హాంకాంగ్, తైవాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా చేసుకున్న దిగుమతుల్లో ఈ ఐదు దేశాల నుంచి రూ. 7,011 కోట్ల విలువైన టీవీలను భారత్ దిగుమతి చేసుకున్నట్టు రవిశంకర ప్రసాద్ వెల్లడించారు. ఎల్ఈడీ, ఎల్సీడీతో పాటు ప్లాస్మా టీవీలను దేశీయంగా తయారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు.