తల్లికి రెండో పెళ్లి చేసిన యువకుడు.. లైకులు, షేర్లతో ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు!
- అమ్మ తల నుంచి రక్తం కారడం గమనించా
- ఎందుకు భరిస్తున్నావు అమ్మా అని అడిగా
- నీ కోసం ఇంకెంత బాధైనా భరిస్తానని చెప్పింది
తన తండ్రి ఓ రోజు తన తల్లిని కొట్టడంతో ఆమె తల నుంచి రక్తం రావడాన్ని గమనించి ఎందుకు భరిస్తున్నావు అమ్మా? అని అడిగానని తెలిపాడు. అప్పుడు తన తల్లి, తన కోసమే బతుకుతున్నానని, ఇంకా ఎంత బాధైనా భరిస్తానని తెలిపిందని చెప్పాడు. ఆ తరువాత తల్లితో కలిసి ఇంట్లో నుంచి వచ్చేశానని, ఆ రోజే తన తల్లికి మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్టు గోకుల్ శ్రీధర్ తెలిపాడు. తన కోసం జీవితాన్ని ధారపోసిన తల్లి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదన్నాడు. గోకుల్ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. 30 వేలకు పైగా లైకులు, 3 వేలకు పైగా షేర్లు సంపాదించుకుంది. గోకుల్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.