ప్రజలిచ్చిన తీర్పు సరైనదో? కాదో? కాలమే నిర్ణయిస్తుంది: విజయశాంతి
- తెలంగాణలో మూడు స్థానాల్లో విజయాన్ని అందుకున్న కాంగ్రెస్
- పార్టీలకు అతీతంగా విజేతలకు అభినందనలు
- కాంగ్రెస్కు విజయాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు
నిన్న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ ఊరటనిచ్చే విజయాలు అందుకుంది. తెలంగాణలో నల్గొండ, మల్కాజిగిరి, భువనగిరి స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి చివరి వరకు పోరాడినా టీఆర్ఆర్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక, బీజేపీ కూడా నాలుగు స్థానాల్లో విజయం సాధించి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది.