ఉత్కంఠను రేకెత్తిస్తోన్న త్రిష 60వ సినిమా ట్రైలర్
- త్రిష తాజా చిత్రంగా 'పరమపదం విలయాట్టు'
- పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
త్రిష కెరియర్లో ఇది 60వ సినిమా. ఈ రోజున త్రిష పుట్టినరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. త్రిష చుట్టూ తిరిగే కథ కావడంతో, ఆమె కాంబినేషన్లోని ఆసక్తికరమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ తో ఉత్కంఠను పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.