'విరాటపర్వం'లో లేడీ విలన్ గా టబు
- వేణు ఊడుగుల నుంచి 'విరాటపర్వం'
- రానా సరసన సాయిపల్లవి
- జూలై నుంచి సెట్స్ పైకి
ఈ సినిమాలో ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా .. ఒక రకంగా లేడీ విలన్ గా కనిపిస్తుందని అంటున్నారు. తన పాత్ర పూర్తి వైవిధ్యభరితంగా ఉండటం వలన, ఇంతరవరకూ ఈ తరహా పాత్రను తాను పోషించకపోవడం వలన ఈ పాత్ర చేయడానికి 'టబు' వెంటనే అంగీకరించిందని చెబుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయి .. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.