మరో రొమాంటిక్ లవ్ స్టోరీలో షాలినీ పాండే
- 'అర్జున్ రెడ్డి'తో షాలిని పాండేకి క్రేజ్
- '118' మూవీతో మరో సక్సెస్
- రాజ్ తరుణ్ జోడీగా ఛాన్స్
అలాంటి ఈ సుందరికి తాజాగా మరో ప్రేమకథలో అవకాశం దక్కింది. రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అవికా గోర్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి షాలినీ పాండేను తీసుకున్నారా? లేదంటే అవికాతో పాటు షాలినీని తీసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.