'ఊరంతా అనుకుంటున్నారు' టీజర్ రిలీజ్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- ఒక హీరోగా నవీన్ .. మరో హీరోగా అవసరాల
- దర్శకుడిగా బాలాజీ సానల
నవీన్ విజయ్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా, కృష్ణ .. విజయ నిర్మల చేతుల మీదుగా ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయించారు. నవీన్ పై మాత్రమే కట్ చేసిన ఈ టీజర్ ను వదిలారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ .. టైటిల్ బాగుంటే సినిమా సగం సక్సెస్ అయినట్టే. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ కథకి మంచి టైటిల్ దొరికింది. కథ వినగానే నరేశ్ ఓకే చెప్పేశాడంటే, ఈ సినిమాలో విషయం వుండే వుంటుందని స్పష్టమవుతోంది. ఈ సినిమాతో నవీన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.