ఎన్టీఆర్ బయోపిక్ లో మరో యంగ్ హీరోయిన్
- షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్
- కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్
- త్వరలో ఆమెపై చిత్రీకరణ
ఎన్టీఆర్ సరసన కథానాయికగా కృష్ణకుమారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అందువలన ఈ బయోపిక్ లో కృష్ణకుమారి పాత్ర కూడా కనిపించనుంది. ఆ పాత్రకి గాను మాళవిక నాయర్ ను తీసుకున్నారు. త్వరలోనే బాలకృష్ణ .. మాళవిక నాయర్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.