సన్నీలియోన్ సినిమాకు నిరసనల సెగ.. కర్ణాటకలో ఆందోళన నిర్వహించిన రక్షణ వేదికె యువసేన!
- వీర మహాదేవి చిత్రంలో సన్నీ నటించడంపై ఆగ్రహం
- వెంటనే షూటింగ్ ను నిలిపివేయాలని డిమాండ్
- చేతులను బ్లేడ్లతో కోసుకున్న యువకులు

సినిమా షూటింగ్ ను వెంటనే ఆపేయాలనీ, వాడి ఉదయన్ అందరికీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక రక్షణ వేదికె యువసేన డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సన్నిలియోన్ పోస్టర్లను తగులబెట్టి నిరసన తెలియజేశారు. మరోవైపు చిత్రదుర్గంలోనూ సన్నిలియోన్ ను వీరమహాదేవి సినిమాలో ప్రధాన పాత్ర ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు.