‘కన్నానులే’ పాటతో 'అమ్మ' జయలలితను ఆనందపరిచిన రెహ్మాన్
మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం ‘చెక్క చీవంత వాణం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక సందర్భంగా వైరముత్తు మాట్లాడుతూ.. ‘అమ్మకు రెహ్మాన్ పాటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బాంబే చిత్రంలోని ‘కన్నానులే...’ పాటంటే మరింత ఇష్టం. కొన్నేళ్ల క్రితం అమ్మ రెహ్మాన్ స్టూడియోకు వచ్చి ఏదైనా పాట పాడమనగానే.. రెహ్మాన్ అదే పాటను పాడి వినిపించారు. ఆ పాట విన్న అమ్మ మైమరచిపోయారు’ అని వెల్లడించారు.