సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సాయిపల్లవికి పాత్ర నచ్చలేదట!
- మెగా హీరో సినిమాలో రమ్యకృష్ణ
- మలయాళ సినిమాలో సన్నీలియోన్
* ప్రస్తుతం 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ తాజాగా మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. వరుణ్ తేజ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కీలక పాత్రను పోషించేందుకు రమ్యకృష్ణ ఓకే చెప్పినట్టు సమాచారం.
* దక్షిణాది భాషా చిత్రాలలో అప్పుడప్పుడు కీలక పాత్రలలో నటిస్తున్న బాలీవుడ్ భామ సన్నీ లియోన్ తాజాగా ఓ మలయాళ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. 'ఒరు అదార్ లవ్' చిత్రం ఫేం ఒమర్ లూలు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సన్నీ లియోన్ నాయికగా నటిస్తుంది.