కరెన్జీత్ కౌర్‌లో నేనేంటో చూడండి.. సన్నీలియోన్ బ్రాండ్ మాత్రమే: సన్నీలియోన్
- సినిమాలో మీరు చూసేదంతా నా వ్యక్తిత్వం
- ఈ సినిమాపై ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో
- తన బయోపిక్ గురించి మాట్లాడిన సన్నీ
ప్రేక్షకులు మంచో, చెడో ఏదో ఒకటి చూడబోతున్నారని, వారేం చెబుతారన్న దానిపై కొంత భయంగా కూడా ఉందని సన్నీ పేర్కొంది. తన బయోపిక్‌లో కరెన్జీత్ వోహ్రా కనిపిస్తుందని, అది నిజమైన తన (సన్నీ) కారెక్టర్ అని వివరించింది. సన్నీలియోన్ అనేది బ్రాండ్ మాత్రమేనని పేర్కొంది. దానిని తానే సృష్టించుకున్నానని తెలిపింది. ‘‘అది సినిమా కావచ్చు, పాట కావచ్చు, ఫొటో షూట్ కావచ్చు.. అందులో ప్రజలు చూసేది నా వ్యక్తిత్వాన్ని మాత్రమే’’ అని సన్నీ పేర్కొంది.