నిర్మాతగా కోన వెంకట్ .. కీలకపాత్రలో మాధవన్
- రచయితగా కోన వెంకట్ కి మంచి పేరు
- నిర్మాతగాను ప్రయోగాలు
- త్వరలో పూర్తి వివరాలు
ఈ సినిమా రిలీజ్ తరువాత మాధవన్ కి తెలుగు నుంచి మరిన్ని అవకాశాలు వెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ నిన్నటి వరకు వినిపించింది. కానీ ఈ సినిమా సెట్స్ పై వుండగానే మాధవన్ కి మరో ఛాన్స్ వెళ్లినట్టు తెలుస్తోంది. రచయిత కోన వెంకట్ నిర్మాతగా .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో కీలకమైన పాత్రకి మాధవన్ అయితే బాగుంటుందని భావించిన కోన .. మాధవన్ ను సంప్రదించడం, ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.