మరోసారి అక్కినేని పాత్రలో కనిపించనున్న చైతూ?
- క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్
- ఏఎన్నార్ పాత్రపై కసరత్తు
- చైతూతో సంప్రదింపులు
బాలకృష్ణ ప్రధాన పాత్రగా 'ఎన్టీఆర్ ' బయోపిక్ ను క్రిష్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. అందువలన ఎన్టీఆర్ కెరియర్లో అక్కినేని పాత్ర కనిపించి తీరుతుంది. ఈ కారణంగానే చైతూను సంప్రదించిన క్రిష్ .. ఏఎన్నార్ పాత్రను పోషించమని కోరాడట. ఏఎన్నార్ పాత్ర నిడివి ఎక్కువగానే వుంటుందనీ .. సన్నివేశాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టుగా సమాచారం. మరి చైతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.