పంది పిల్లకు పళ్లు తోముతున్న రవిబాబు.. వీడియో వైరల్!
- రవిబాబు దర్శకత్వంలో 'అదుగో' సినిమా
- విభిన్న కథతో వస్తోన్న దర్శకుడు
- సినిమాలో ప్రధానపాత్రలో పంది పిల్ల
పంది పిల్లకు పళ్లు తోముతూ దాన్ని బుజ్జగిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో రవిబాబు తండ్రి, నటుడు చలపతిరావు ఫేస్బుక్లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా అందర్నీ బాగా నవ్విస్తుందని, మీ ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని ఆశిస్తున్నానని చలపతి రావు పేర్కొన్నారు.
ప్రతి సినిమాకూ ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టే బాగా ఆడుతున్నాయని, ప్రేక్షక దేవుళ్లకు మరోసారి నమస్కారాలు తెలుపుతున్నానని, ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండని అన్నారు. ‘అదుగో’ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టే రవిబాబు ఈ సారి మరో ప్రయోగంతో ముందుకు వస్తున్నాడు.