సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి సురవరం సుధాకర్‌రెడ్డి!
- ముగిసిన సీపీఐ 23వ జాతీయ మహాసభలు
- జాతీయ కౌన్సిల్ సభ్యులుగా 126 మంది నియామకం
- లౌకిక శక్తులు ఏకం కావాలని సురవరం పిలుపు
ఆదివారంతో ముగిసిన ఈ సభల్లో కొందరు సీనియర్లను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఢిల్లీ జేన్ఎన్టీయూ మాజీ విద్యార్థి కన్నయ్య కుమార్‌ను జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ ఆరెస్సెస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.