'రంగస్థలం'లో పలకరించనున్న 'సవ్యసాచి' టీజర్
- ఈ నెల 30వ తేదీన 'రంగస్థలం' రిలీజ్
- ఆ సినిమాలో 'సవ్యసాచి' టీజర్ ప్రదర్శన
- భారీ క్రేజ్ కోసమే ఈ నిర్ణయం
ఈ నెల 27వ తేదీన ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన విడుదలవుతోన్న 'రంగస్థలం' సినిమాకి ఈ టీజర్ ను జోడించనున్నారు. 'రంగస్థలం' సినిమాకి విపరీతమైన క్రేజ్ వుంది. భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో 'సవ్యసాచి' సినిమా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించడం కోసం 'రంగస్థలం' సినిమాకి టీజర్ ను అటాచ్ చేస్తున్నారు.