'సవ్యసాచి'కి హైలైట్ గా నిలవనున్న అంశం అదేనట!
- సవ్యసాచి'గా చైతూ
- ఆయన అక్క పాత్రలో భూమిక
- జూన్ 14న విడుదల
ఈ సినిమాలో చైతూ అక్క పాత్రలో భూమిక నటిస్తోంది. ఆమెకి జరిగిన అన్యాయానికి తమ్ముడిగా చైతూ ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన కథాంశమని తెలుస్తోంది. సినిమాకి హైలైట్ గా నిలిచేది కూడా ఈ అంశమేనని అంటున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా మాధవన్ కనిపించనున్నాడు. ఇక రావు రమేష్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.