'మహానటి' కోసం ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య
- షూటింగు దశలో 'మహానటి'
- ఒక వైపున సీనియర్ ఆర్టిస్టులు
- మరో వైపున యువకథానాయకులు
ఇక ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య నటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14 .. 15 తేదీలలో నాగచైతన్యపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ పాత్రను మాత్రం గ్రాఫిక్స్ ద్వారా చేస్తారట. త్వరలోనే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆరంభించనుందని అంటున్నారు. సావిత్రి అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.