చైతూ .. సమంత జోడీకి భారీ పారితోషికం!
- 'నిన్నుకోరి' దర్శకుడితో చైతూ
- కథానాయికగా సమంత ఖరారు
- ఆడియన్స్ లో ఈ జంటను చూడాలనే ఆసక్తి
సాధారణంగా ఒక సినిమాకి చైతూ 3 కోట్లకి పైగా తీసుకుంటాడు. ఇక సమంత ఒకటిన్నర వరకూ తీసుకుంటుంది. అయితే వివాహం తరువాత చైతూ .. సమంతల కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ క్రేజ్ కి తగినట్టుగా ఇద్దరికీ కలిపి 7 కోట్ల వరకూ పారితోషికం ఇవ్వమని చైతూ అడిగినట్టుగా టాక్. నిర్మాతలు కొన్ని రోజుల పాటు ఆలోచన చేసినా, చివరికి అందుకు అంగీకరించారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.