సరోగసీ ద్వారా ఇద్దరికి తల్లయిన సన్నీ లియోన్....!
- గత జూన్లో మహారాష్ట్ర బాలిక నిషా కౌర్ దత్తత
- తాజాగా సరోగసీతో ఇద్దరు మగ పిల్లలు
- సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటోతో సర్ప్రైజ్ చేసిన వైనం
మగపిల్లలకు అషర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టింది. ముగ్గురు పిల్లలను పెంచడం సాధ్యమేనని తనకు అనిపించిందని, అందుకే ఇద్దరు పిల్లల్ని సరోగసీ ద్వారా పుట్టించుకున్నట్లు తన సందేశంలో పేర్కొంది. దేవుడు ప్రణాళిక ప్రకారం, తమకు పెద్ద కుటుంబం దక్కిందని ఈ శృంగార తార ఆనందం వ్యక్తం చేస్తోంది. ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా తాము చాలా గర్వపడుతున్నామని సన్నీ చెప్పింది. అందరినీ ఈ రకంగా సర్ప్రైజ్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది.