బాక్సాఫీసు వద్ద ఏమాత్రం తగ్గని 'పద్మావత్' కలెక్షన్ల జోరు!
- రూ.265 కోట్ల వసూళ్లు...300 కోట్ల మార్కు దిశగా పరుగులు
- రిలీజైన మొదటివారంలో రూ.166 కోట్ల కలెక్షన్లు
- భన్సాలీ వెండితెర అద్భుతానికి ప్రేక్షకుల నీరాజనాలు
ఈ చిత్రం రిలీజైన మొదటివారంలోనే రూ.166.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అప్పటి నుంచి అదే దూకుడును కొనసాగిస్తోంది. రెండో వారంలో రూ.129 కోట్లను వసూలు చేసింది. అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ రాజ్పుత్ కర్ణిసేన సహా పలు సంస్థలు ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.