ఆసక్తిని రేకెత్తించే కంటెంట్ తో ' టిక్ .. టిక్ .. టిక్'
- సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా 'టిక్ .. టిక్ .. టిక్'
- తాజాగా ఆడియో విడుదల
- ఈ నెల 26వ తేదీన తమిళంలో రిలీజ్
- తెలుగులోను ఇదే టైటిల్ తో
తాజాగా చెన్నైలో ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేశారు. డి.ఇమాన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో, నివేదా పెతురాజ్ కథానాయికగా నటించింది. తమిళంలో ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను ఇదే పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో తనకి మరో హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో జయం రవి వున్నాడు.