'అజ్ఞాతవాసి' తరువాత పవన్ కల్యాణ్ సినిమా ఇదే!
- సినిమాలకు విరామం వార్తలు అవాస్తవమే
- 'వేదాళం' రీమేక్ కు ఓకే చెప్పిన పవన్
- జనవరి నుంచి షూటింగ్!
తమిళంలో అజిత్ హీరోగా నటించగా, సూపర్ హిట్ అయిన 'వేదాళం' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి తయారు చేసే స్క్రిప్టు పనులు ఇప్పుడు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది. మిగతా నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పని పూర్తయిన తరువాత, జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.